సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 2019 ఎన్నికలలో వైసీపీ టికెట్ ఇవ్వకపోవడంతో జనసేన పార్టీ తరపున రాజోలు నుండి పోటీ చేసి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కు రాష్ట్రంలో ఒక ప్రత్యక గుర్తింపు ఉంది. తదుపరి పరిణామాలలో ఆయనకి వైసీపీ కండువా కప్పక పోయిన.. రాపాక వైసీపీ మద్దతు దారుడిగా జగన్ పక్షన ఎమ్మెల్యే గా పనిచేసారు. మొన్నటి 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా రాపాక కు రాజోలు టికెట్ ఇవ్వకుండా జగన్ ట్విస్ట్ ఇచ్చి అమలాపురం ఎంపీ టికెట్ కేటాయించారు. అక్కడ రాపాక ఓటమిపాలయ్యారు. ఇది ఇలా ఉండగా రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైసీపీకి గుడ్ బై చెప్పనున్నట్లునేడు, ఆదివారం ప్రకటించారు. ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీ పెద్దలకు తెలిజేసినట్లు ఆయన తెలిపారు. తాను జనసేన తరఫున గెలిచినప్పటికీ వైసీపీ పార్టీకి ఇన్నాళ్లూ అనుకూలంగా పని చేశానని, అయినప్పటికీ తనకి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన మీడియా తన బాధను వ్యక్తం చేసారు. 2024 ఎన్నికల్లో తనకు రాజోలు ఎమ్మెల్యే సీటు కేటాయించలేదని ,పైగా తనకు ఇష్టలేకపోయిన ఎంపీగా నిలబెట్టారని ధ్వజమెత్తారు. తాజాగా రాజోలు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా గొల్లపల్లి సూర్యరావునే మళ్లీ ప్రకటించారని, ఇక వైసీపీ . పార్టీలో తనకు ప్రాధాన్యం లేదని, అలాంటి చోట తాను ఉండలేనని ..ఇక వేరే పార్టీల నుంచి ఆహ్వానం వస్తే పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
