సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం స్థానిక శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు Dr. బి.వి. రాజు ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ Dr.బి.వి. రాజు గారి 104వ జయంతిని పురస్కరించుకొని నేడు 15.10.2024 భీమవరం నందు మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో పలు సేవా కార్యక్రమములు ఘనంగా నిర్వహించారు. కాలేజీ నందు గల Dr. బి.వి. రాజు గారి సమాధి వద్ద శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు Dr. బి.వి. రాజు ఫౌండేషన్ కు చెందిన వివిధ కళాశాలల డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు నివాళులు అర్పించారు. విద్యార్థులందరూ Dr. బి.వి. రాజు గారిని ఆదర్శముగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, ప్రతిభ కనపరచిన 18 మంది పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్పులను నగదు రూపంలో అందజేసినారు. డాక్టర్ బి.వి. రాజు గారు స్వగ్రామం అయినటువంటి కుందువల్లి గ్రామంలో 500 మంది పేదవారికీ ఆపిల్ పండ్లు, బిస్కట్లు మరియు బ్రెడ్లు పంచినారు. ఫాదర్ FMLR సెంటరు, శృంగవృక్షం నందు 100 లెప్రసీ రోగులకు ఆపిల్ పండ్లు, బిస్కట్లు మరియు బ్రెడ్లు పంపిణీ చేశారు. St. మేరీస్ లెప్రసీ సెంటరు నందు 250 మంది లెప్రసీ, ఎయిడ్స్, టీ.బి. రోగులకు Rs.60,000/- రూపాయల విలువ గల మందులతో పాటు బియ్యం, ఆపిల్ పండ్లు, బిస్కట్లు మరియు బ్రెడ్లు పంచిపెట్టారు. St. మేరీస్ హాస్పిటల్ నందు 50 మందికి ఆపిల్ పండ్లు, బిస్కట్లు మరియు బ్రెడ్లు పంపిణీ చేశారు. భీమవరం 7 వ వార్డు నందు గల 112 మంది లెప్రసీ రోగులకు ప్రతి ఒక్కరికీ బియ్యం, ఆపిల్ పండ్లు, బిస్కట్లు, బ్రెడ్లలతో పాటు పెన్షన్ లు (భృతి) అందజేయడం జరిగింది.స్థానిక Dr. బి.వి.రాజు మార్గ్ మరియు బి.వి. రాజు మునిసిపల్ పార్కు నందు గల బి.వి.రాజు గారి విగ్రహములకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విష్ణు క్యాంపస్ నందు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 106 మంది విద్యార్థులు, సిబ్బంది రక్తదానం చేసారు.
