సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో జాతీయ చైతన్య భారతి నాటక పరిషత్ కార్యనిర్వహణ కార్యదర్శి, కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షులు, వైసీపీ నేత , ప్రముఖ లాయర్ రాయప్రోలు శ్రీనివాస్ మూర్తి పుట్టినరోజు వేడుకలను చైతన్య భారతి, కృష్ణ మహేష్ బాబు అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ నిర్ధిష్టమైన సమాజ సేవలకు స్ఫూర్తి రాయప్రోలు శ్రీనివాస్ మూర్తి అని అన్నారు.రాజకీయ పదవుల్లో లేకపోయినా ఇంతమంది అభిమానులు ఈ విధంగా నిర్వహిం చడం ఆయన ప్రజల గుండెల్లో కొలువున్నారనడానికి సాక్ష్యం అన్నారు.చైతన్య భారతి నాటక పరిషత్ అధ్యక్షులు రాయప్రోలు భగవాన్, సభ్యులు భట్టిప్రోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ భీమవరంలో పలుమారులు కౌన్సిలర్ గా ఎన్నో అభివృద్ధి పనులలో కీలక పాత్ర పోషించారని సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ప్రతిష్ఠకు రాయప్రోలు ఎంతో కృషి చేశారని, రాయప్రోలు సేవలు ఎనలేనివని అన్నారు. అనంతరం రాయప్రోలు శ్రీనివాస్ మూర్తిని సత్కరించారు. కార్యక్రమంలో కట్రేడ్డి సత్యనారాయణ,బొండా రాంబాబు, పేరిచర్ల లక్ష్మణ వర్మ, పెన్నాడ శ్రీనివాస్, సుంకర బాబురావు,చిక్కాల బాబ్జి, భూపతిరాజు సుబ్బరాజు, గంట్ల ప్రసాద్, బోనం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
