సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాండాల్ఫ్ సమీపంలో స్టేట్ హైవేపై గత సోమవారం సాయంత్రం 6.45 గంటలకు రెండు వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. దీంతో ఐదుగురు ప్రవాస భారతీయులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒక మహిళ సహా ముగ్గురు ఏపీలోని చిత్తూరు వాసులుగా టెక్సాస్ పబ్లిక్ సేఫ్టీ వర్గాలు గుర్తించాయి. మృతులు ఆర్యన్ రఘునాథ్ ఓరంపాటి, ఫరూక్ షేక్, లోకేష్ పాలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్‌లుగా గుర్తించారు. ఇద్దరు వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. వివరాల ప్రకారం.. అమెరికాలోని రాండాల్స్ సమీపంలో రాష్ట్ర రహదారిపై దక్షిణ బాన్ హామ్‌కు ఆరు మైళ్ల దూరంలో అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 6.45 నిమిషాలకు రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు టెక్సాస్ పబ్లిక్ సేఫ్టీ వర్గాలు తెలిపాయి. . ఈ ప్రమాదంపై మృతుల కుటుంబాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
