సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు, సోమవారం (అక్టోబర్ 21న) భారీ నష్టాలతో ముగిశాయి. క్యూ2 ఎర్నింగ్స్ సీజన్‌లో ఇన్వెస్టర్లు అధిక స్థాయిలో లాభాలను బుక్ చేసుకోవడంతో భారత స్టాక్ మార్కెట్లు ఒత్తిడికి లోనయ్యాయి. ఈ క్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ ధరలో దాదాపు 3 శాతం పెరుగుదల ఉన్నప్పటికీ, బెంచ్‌మార్క్ సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీలు ప్రతికూలంగా ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 73.48 పాయింట్లు క్షీణించి 81,151.27 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 కూడా 73 పాయింట్ల నష్టాలతో 24,781 వద్ద ప్రతికూల జోన్‌లో ముగిసింది. దీంతో మదుపర్లు సుమారు 3 లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు. ఈ క్రమంలో టాటా కంన్జ్యూమర్ ప్రొడక్ట్స్, కోటక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్, BPCL, ఇండస్ఇండ్ బ్యాంక్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా, బజాజ్ ఆటో, HDFC బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, M&M, ఐషర్ మోటార్స్ సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో నిలబడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *