సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ నగరు నగర శివారు కోకాపేటలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టాణానికి చెందిన నాగ ప్రభాకర్ (27) అనే యువకుడు బలవన్మరణానికి పాల్ప డ్డాడు. గచ్చిబౌలి లో ఒక కంపెనీ లో సాఫ్ట్ వెర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఈ యువకునికి ఇటీవల మానసిక ఒత్తడితో పాటు అప్పుల బాధలు ఎక్కువ అయ్యాయని ప్రాధమిక సమాచారం. నాగ ప్రభాకర్ గత గురువారం కోకాపేటలోని విరూపాక్ష మెన్స్ హాస్టల్ కు వచ్చి 7వ అంతస్తు పైనుంచి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాగ ప్రభాకర్ కోకాపేటలోని ఈ హాస్టల్ భవనానికి ఎందుకు వచ్చాడో ?తెలియవల్సి ఉంది. సికింద్రాబాద్ లో ఉన్న ప్రభాకర్ సోదరి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
