సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దీపావళి పండుగ వేళ ఏలూరులో లో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గత గురువారం ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏలూరులో సుధాకర్ అనే వ్యక్తి బాణాసంచాను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్తున్నాడు. వాటిలో ఉల్లి బాంబుల మూట ఉండటంతో తూర్పువీధి సెంటర్ వద్ద వారి బైకు ఒక్కసారి రోడ్డు ఫై గోతులో పడి పైగా లేవగానే ఒక్కసారిగా లోపల ఉల్లి పటాసులు రాపిడి పెరిగి ఆయన తీసుకెళ్తున్న బాణాసంచా పేలిందని, ఒక్కసారిగా పెనువిస్పోటనం సంభవించింది. బాణాసంచాను తీసుకెళ్తున్న సుధాకర్ పేలుడు ధాటికి రెండు ముక్కలయ్యాడు. అలాగే అతని వెనకాల కూర్చున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న మరో ఐదుగురు గాయపడ్డారు. మొత్తం ఈ సంఘటనలో ఆరుగురు గాయపడ్డారు.పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. వీరిలో ముగ్గురి పరిస్థితి నేటి శుక్రవారం ఉదయానికి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
