సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గంలో ప్రజలు ట్యాప్ తిప్పితే ప్రతి ఇంటిలో మంచినీరు రావాలని, శివారు ప్రాంతానికి కూడా మంచినీటిని అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. నేడు, మంగళవారం భీమవరం మండలం వెంప గ్రామంలో సుమారు రూ 37.95 లక్షలతో జల జీవన్ మిషన్ లో భాగంగా మైక్రో పిల్టర్ ను ప్రారంభించగా, సుమారు రూ 72 లక్షల నిధులతో చేపడుతున్న పైపు లైన్ పనులకు ఎమ్మెల్యే అంజిబాబు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ .. జల జీవన్ మిషన్ కింద రూ 38 లక్షలతో మైక్రో పిల్టర్ ను, సుమారు రూ 72 లక్షలతో 3800 మీటర్ల పైపు లైన్ లకు శంకుస్థాపన చేయడం జరిగిందని, త్వరలోనే అన్ని పనులను పూర్తి చేస్తామని అన్నారు. గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీరు రావాలని, దానిలో భాగంగానే మైక్రో పిల్టర్ ను ఏర్పాటు చేశామని అన్నారు.ఈ . కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇంజేటి రాజేశ్వరి, ఎంపిపి పేరిచర్ల విజయ నరసింహ రాజు, ఎంపీటీసీ చీలకపాటి కుమారి, ఉప సర్పంచ్ కలిదిండి చిన బంగార్రాజు, కలిదిండి రామ చంద్రరాజు, కట్టా నాగేశ్వర్రావు, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ రాజు, ఎండివో గంగాధర్, తహశీల్దార్ రవి రాంబాబు, టీడీపి జనసేన, బిజెపి నేతలు పాల్గొన్నారు.
