సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖరారు కావడంతో మార్కెట్లలో జోష్ నెలకొంది. భారతీయ దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు, బుధవారం భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. సెన్సెక్స్ మరోసారి 80 వేల మార్కును అధిగమించింది. ప్రస్తుతం సెన్సెక్స్ 723 పాయింట్ల లాభంతో 80,211 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 209 పాయింట్లు పుంజుకుని 24,422కి చేరుకుంది. ఐటీ, టెక్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. టీసీఎస్ 3.88 శాతం, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 3.82 శాతం, టెక్ మహీంద్రా 3.77 శాతం, ఇన్ఫోసిస్ 3.77 శాతం భారీగా లాభపడ్డాయి. గత మంగళవారం 79,476 వద్ద క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు లాభాల్లో దూసుకుపోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *