సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మనిషి కసితో గతి తప్పితే సాటి మనిషినే కాదు ఆఖరికి పశువులను పందెపు కోళ్లను సైతం మట్టు బెట్టేస్తాడని ఈ ఘటన సాక్ష్యంగా నిలుస్తుంది. సంక్రాంతి కోడి పందాలకు తెలుగు రాష్ట్రాలలో ఖ్యాతి గాంచిన పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. మొగల్తూరు మండలం కొత్తోట గ్రామంలో గత సోమవారం అర్ధరాత్రి పందెం కోళ్ల పెంపకం జరుగుతున్నా పాకకు గుర్తుతెలియని వారు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో కోళ్ల రైతు కౌరు గోకన్నకు చెందిన 80 పందెం కోళ్లు పూర్తిగా ఖాళీ బూడిదయ్యాయి. తాళ్లు కట్టిన కోడిపుంజులు నిలబడిన చోటే సజీవ దహనం అయ్యి పాక పూర్తిగా కాలిపోవడంతో లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు రైతు గోకన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన యజమాని కోసం పందెంలో వీరమరణం పొందితే ఆ కోడిపుంజు కి ఆడో గౌరవం.. కానీ ఆ దృశ్యం చూసినవారికి ఆఖరికి కోళ్లపై కూడా ఇంత ఉన్మాదం గా ప్రవర్తిస్తారా?అనిపించక మానదు.
