సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ పోలీసులు రామ్ గోపాల్ వర్మ ను ఎక్కడ ఉన్న అరెస్ట్ చెయ్యడం చెయ్యడం ఖాయం అని విస్తృతంగా జరిగిన ప్రచారానికి ఇక బ్రేక్ పడింది. వాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు తాజగా ఏపీ హైకోర్టు లో ముందస్తు బెయిల్ లభించింది. గత ఏడాది ప్యూహం సినిమా రిలీజ్ సమయంలో సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , నారా లోకేష్‌పై అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టారని ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలుచోట్ల టీడీపీ మద్దతు దారులు ఇచ్చిన ఫిర్యాదులతో ఈనెల 10న ఏడు సెక్షన్లతో రాంగోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు.వెంటనే రాంగోపాల్ వర్మకు అరెస్ట్ కు విశ్వ ప్రయత్నాలు జరిగాయి. అయితే ఇటువైపు గాడి తప్పిన మహా మేధావి వర్మ.. సోషల్ మీడియా పోస్టులకే ఇలా అరెస్టులు చేస్తూ పొతే దేశంలో80 శాతం మంది జైలు లో ఉంటారు అంటూ గడసరిగా మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తాజాగా హైకోర్టు (AP High Court) ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అలాగే దర్యాప్తుకు సహకరించాలని రామ్ గోపాల్ వర్మకు న్యాయస్థానం ఆదేశించింది. ఇదిలా ఉండగా పుష్ప 2 విజయాన్ని తన విజయంగా ఆస్వాదిస్తున్న వర్మ ‘అల్లు అర్జున్ ఫై పోలీస్ కేసు’ పెట్టడాన్ని ఇటీవల తన పోస్టులలో పెద్ద ఎత్తున అభ్యన్తరం వ్యక్తం చేస్తూ.. ఇక దేశంలో హీరోలలో ‘బన్నీ యే బిగ్ బాస్’ అంటూ మరో వివాదంలో బిజీగా ఉన్నారు.
