సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క బంగ్లాదేశ్ లో హిందువులఫై జరుగుతున్నా మారణకాండతో, ఇటీవల భారత్ ఫై ఇరుగు పొరుగు దేశాలను రెచ్చగొడుతూ పాకిస్తాన్, చైనా పెడుతున్న చిచ్చు తో దేశంలో ఎక్కువ శాతం ప్రజల ఆలోచనలు నిర్ణయాలు మారుతున్నాయి. దీనికి మహారాష్ట్ర ఎన్నికలు ఫలితాలు ఉదాహరణగా నిలిచాయని బీజేపీ గట్టిగ నమ్ముతుంది. దీనితో ఎట్టి పరిస్థితులలో 2027లో దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ వేగంగా ప్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర కేబినెట్ రేపు బుధవారం న్యూఢిల్లీలో సమావేశం కానుంది. ఒకే దేశం.. ఒకే ఎన్నికకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర న్యాయ శాఖ రూపకల్పన చేసే పనిలో నిమగ్నమైందని తాజా సమాచారం.ఈ రేపు బిల్లు బుధవారం జరిగే కేంద్ర కేబినెట్ సమావేశం ముందుకు రానుంది. కేంద్ర కేబినెట్ ఆమోదం అనంతరం పార్లమెంటు ముందుకు ఒకే దేశం ఒకే ఎన్నిక..’జమిలీ ఎన్నికలు’ బిల్లు రానుంది. మరోవైపు ఒకే దేశం ఒకే ఎన్నికకు మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికకు గతంలోనే కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన విషయం గమనార్హం. .కోవింద్ అందించిన నివేదిక ఆధారంగా.. అందుకు సంబంధించిన బిల్లు రూపొందుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *