సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజక వర్గం, వీరవాసరం మండలం, నందమూరుగరువు గ్రామంలో ప్రతిష్టాకరంగా జరిగే శ్రీ శ్రీ శ్రీ రామ భక్త ఆంజనేయ స్వామి వార్షికోత్సవాలు అంటే జిల్లాలో తెలియనివారు ఉండరు. ఇక్కడ అభయ ప్రదాత, ఎంతో మహిమానిత శ్రీ ఆంజనేయ స్వామివారి ని దర్శించకుండా ఏ వాహనదారుడు ముందుకు వెళ్లాడంటే అతిశయోక్తి కాదు.. ప్రతి ఏడాది 13 రోజులు పాటు భారీ సెట్టింగ్స్, లైటింగ్, భారీ ఎగ్జిబిషన్ లతో, జానపద కళాకారుల పురాణ నాటక ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా చివరి రోజు భారీ అన్నసమారాధన తోజరిగే ఉత్సవాలలో శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. ఈ డిసెంబర్ నెల 13వ తేదీ శుక్రవారం నుండి 59 వ వార్షిక ఉత్సవాలను స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభిస్తున్నారు. డిసెంబర్ 25వ తేదీ బుధవారం వరకు జరిగే వేడుకలను స్థానిక శ్రీ రామ భక్త ఆంజనేయ స్వామి వారి ఉత్సవ కమిటీ నిర్వాహకులు నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *