సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వరల్డ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ వచ్చిన ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa 2 The Rule) సినిమా దేశవ్యాప్తంగా అఖండ విజయం సాధించిన నేపథ్యంలో విడుదలైన కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా రూ.1000 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. దీనితో దేశవ్యా ప్తంగా ఉన్నఎగ్జిబిటర్లకు ధన్య వాదాలు చెబుతూ నేడు, గురువారం మధ్యాహ్నం దేశరాజధాని ఢిల్లీలో ‘పుష్ప 2 ది రూల్ థాంక్స్ మీట్’ జరిగింది. హీరో అల్లు అర్జున్, మైత్రి మూవీస్ నిర్మాతలు పాల్గొన్నారు. హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఆదరిస్తున్న ప్రేక్షకులకు ‘థాంక్యూ ఇండియా. మా చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ధన్య వాదాలు. ఇది లవ్ కాదు.. వైల్డ్ లవ్. చిత్రబృందానికి ధన్య వాదాలు ఒక వ్యక్తికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలనుకుంటున్నా. అతనే.. ఇండియన్ సినిమా బాక్సా ఫీస్ను రూల్ చేస్తోన్న మా దర్శకుడు సుకుమార్. ఆయన విజన్ నుం చే ఈ సినిమా పుట్టింది. ఆయన హార్డ్ వర్క్ వల్లే ఇది సాధ్య మైంది. థాంక్యూ డార్లింగ్. పుష్ప 1 ది రైజ్’పై విశేష ఆదరణ చూపించిన హిందీ ప్రేక్షకులు, లేకపోతే ‘పుష్ప 2’ ఈ స్థాయికి వచ్చేది కాదు.అయితే రికార్డ్స్ శాశ్వతం కాదు.. వచ్చే ఏడాది వేసవిలోపు ఈ రికార్డులు బద్దలు కావాలని కోరుకుంటున్నా. అప్పుడే సినిమా పురోగతి సాధిం చినట్లు అవుతుం ది’’ అని అల్లు అర్జున్ అన్నారు.
