సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్. భీమవరం స్థానిక D N R ఇంజనీరింగ్ కళాశాలలో నేడు, గురువారం N S S యూనిట్ ఆధ్యర్యంలో A S N రాజు ఛారిట్రబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకు సంయుక్త సహకారంతో.. కళాశాల ఉప అధ్యక్షులు కార్యదర్శి గోకరాజు పాండు రంగారాజు గాదిరాజు సత్య నారాయణ రాజు (బాబు ) సంయుక్తంగా రక్తదాన శిబిరం ను ప్రారంభిచారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ.. రక్తదానం చెయ్యడం మరో మనిషికి ప్రాణదానంతో సమానం అని అన్నారు . అందరూ ఈ రక్తదానం పై అవగాహనా కలిగి రక్తధానం చెయ్యాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రక్తాన్ని కృత్రిమంగా తయారు చెయ్యడం సాధ్యం కాదని ఈ విషయాన్నీ విద్యార్థులు గుర్తించి, ఆపదలో ఉన్న వారిని ఆదుకొని లక్ష్యంతో యువత రక్తదానం చెయ్యాలని అన్నారు. తమ కళాశాలలో N S S యూనిట్ ద్వారా ప్రతి సంవత్సరం రెండు సార్లు రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామని మరి ముఖ్యముగా తలసలేమియా బాధితులకు ఈ రక్తదాన శిభిరం ద్వారా అందిస్తున్నామని అన్నారు. ఈ రక్తదాన శిభిరంలో సుమారు 150 మంది విద్యార్థుల పాల్గొన్నారు. ఈ రక్తదాన శిభిరంలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రధానం చేసారు. ఈ కార్యక్రమాములో కళాశాల ప్రిన్సిపాల్ డా.. M. అంజన్ కుమార్, N S S ఆఫీసర్ వి ప్రవీణ్, ఉపాధ్యాయ, మరియు ఉపాధ్యాయతర సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *