సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్. పుష్ప 2 సంచలన విజయంతో పాన్ ఇండియా ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు.. కేవలం 6 రోజులకే 1000 కోట్ల వసూళ్లు దాటేసిన పుష్ప 2 తాజగా మొత్తం 14 రోజులకే ప్రపంచ వ్యాప్తంగా 1508 కోట్ల కలెక్షన్స్ మార్క్ ను దాటేసింది అని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఒక్క హిందీ వెర్షన్ లోనే 600 కోట్ల కలెక్షన్ దాటెయ్యడం గమనార్హం.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో పుష్ప 2 సినిమా టికెట్స్ తిరిగి సాధారణ ధరలకు వచ్చాయి. ఇక భీమవరం పట్టణంలో నిన్నటికి 14 రోజులకు 1కోటి 58 లక్షల రూపాయలు భారీ కలెక్షన్ వసూళ్లు సాధించింది. నేటి గురువారం నుండి సాధారణ ధరలకు టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *