సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నియమిత కాల పరిమితితో 53 బార్ల లైసెన్స్‌లు వేలం ద్వారా మంజూరు చేస్తున్న నేపథ్యంలో (వచ్చే 2025 ఆగస్టు 31వరకు ) ఆసక్తి ఉన్న ఔత్సాహికులు ఈ వేలంలోపాల్గొనవచ్చు. గతంలో లైసెన్స్ ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బిడ్ అమౌంట్‌ను చెల్లించడంలో విఫలమైన వారి బార్లను ప్రభుత్వం తిరిగి తాజగా వేలం ద్వారా ఔత్సాహికులకు ఇవ్వనున్నామన్నారు. బార్ల కేటాయింపు పూర్తిగా ఈ-వేలం, ఆన్ లైన్ లాటరీ పద్దతిలో జరుగుతుంది. వేలంలో పాల్గొనేవారు 22వ తేదీ వరకు వారి పేర్లను నమోదు, రిజిస్ట్రేష్రన్ ఆన్ లైన్ ద్వారా చేసుకోవాలి. 50వేల జనాభా వరకు రూ. 5లక్షలు, 50వేల పైబడి 5 లక్షల లోపు జనాభా వరకు రూ.7.5 లక్షలు, 5లక్షల జనాభా పైబడిన నగరాలకు రూ.10లక్షలు దరఖాస్తు రుసుము(నాన్ రిఫండబుల్) ఈ నెల 23వ తారీఖు లోపు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 24న ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా హెచ్చు మొత్తంలో పాడుకున్న అభ్యర్థికి సంబంధిత బార్‌ను కేటాయిస్తారు. ఇతర వివరాలకు వెబ్ సైట్‌ను లేదా 8074396416 నెంబర్‌ను సంప్రదించి తెలుసుకోవచ్చని ,ఏపీ అబ్కారీ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
