సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; భీమవరం స్థానిక మునిసిపల్ కార్యాలయం నందు నేడు, శుక్రవారం రెడ్ క్రాస్ సంస్థ ద్వారా మున్సిపల్ ఆఫీసు నందు బ్లడ్ క్యాంపు శిబిరం నిర్వహించడం జరిగినది. ఈ రక్త దానశిబిరం లో భీమవరం మునిసిపల్ కమీషనర్ కె.రామచంద్రా రెడ్డి మరియు మునిసిపల్ సిబ్బంది మరియు వార్డ్ సచివాలయ సిబ్బంది కూడా రక్త దానం చెయ్యడం జరిగింది. .ఈ సందర్భముగా మున్సిపల్ కమిషనర్ కే రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛంద రక్తదానాన్ని అందరూ ప్రోత్సహించాలని మరియు వైద్యపరమైన అవసరాలకు అందరూ సహకరించాలి అని తెలిపారు. ఈ రక్త దానశిబిరం లో పాల్గొన్న అందరికి కమీషనర్ అభినందనలు తెలియచేసారు.
