సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ పట్నంలో వైసీపీ ఎంపీ, ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి నేడు, మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దారుణంగా 15వేల కోట్ల అదనపు భారం మోపుతూ.. రాష్ట్రంలో .కరెంటు చార్జీలు పెంపుపై వైఎస్సార్సీపీ పోరుబాట పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ నెల 27 వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రతిఘటిస్తూ ఇప్పటికే సూపర్ సిక్స్ పధకాలు ఏమి అమలు చెయ్యలేదు సరికదా ఉన్న పింఛనులు కూడా ఎత్తేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు మద్యం త్రాగించడం లో తప్ప అభివృద్ధి ఎందులోను లేదని,అధినేత జగన్ ఆదేశాలమేరకు ఇక సీపీ శ్రేణులు పోరుబాట మొదలు పెట్టాలని పిలుపు నిచ్చారు. చంద్రబాబు దొంగ హామీలతో అధికారంలోకి వచ్చి తన 44 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని ప్రజలను మోసం చేయడానికి ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో వైసీపీ న్యూట్రల్ గా వ్యవహరిస్తుంది అని , ఎన్డీయే కు ఇండియా కూటమికి మధ్యగా ప్రజల పక్షన వ్యవహరిస్తుందని , జమిలి ఎన్నికలు త్వరలో వచ్చే అవకాసమ్ ఉందని , కేంద్ర జమిలి పార్లమెంటరీ కమిటీలో మెంబర్ గా ఉన్నానని త్వరలో దేశవ్యాప్తంగా పర్యటిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు పార్టీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు ఈ పోస్టర్‌ను విడుదల చేశారు
