సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలో భీమవరం లో పలు ప్రాంతాలలో ముఖ్యముగా రూపాంతరం దేవాలయం , లూధరన్ చర్చి, దాగరపు చర్చి, గునుపూడి చర్చి, బేతని చర్చి, సేంట్ మేరీస్ చర్చి , చిన్నపేట చర్చి, తాడేరు రోడ్డు చర్చి తదితర భారీ చర్చిలలో వేలాది జనుల మధ్య గత మంగళవారం రాత్రి నుండి నేటి బుధవారం రాత్రి వరకు దేవుని పుత్రుడు అయిన ఏసు నామాన్ని స్తుతిస్తూ సంగీత విభావరీలు, క్రీస్తు జన్మదినం సందర్భముగా నాటికలు మత పరమైన సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.చర్చి లను విద్యుద్దీపాలు, క్రిస్మస్ ట్రీలతో అందంగా అలంకరించారు. చిన్నా పెద్దా శాంటాక్లాజ్ వేషధారణలతో సందడి చేస్తూ కనిపించారు. పలు ప్రార్థనా మందిరాల్లో క్రీస్తు జననాన్ని వివరించేలా బొమ్మలతో క్రొవొత్తుల వెలుగులో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి పశ్చిమ గోదావరి జిల్లాలోనే అతి పెద్ద చర్చి ,అత్యున్నత ప్రమాణాలతో భీమవరం పీపీ రోడ్డులో ఉన్న నూతన రూపాంతర దేవాలయంలో వేడుకలు అంబరాన్ని అంటాయి. ఈ రూపాంత దేవాలయానికి చాల చరిత్ర ఉంది. బ్రిటిష్ వారి పాలనలో 1895లో సుమారు 72 సెంట్ల విస్తీర్ణం లో రాతి కట్టడంగా దీనిని నిర్మించారు. ఈ చర్చికి కులమత రహితంగా వచ్చే భక్తులకు ఎంతో ప్రశాంతత తో పాటు స్వాంతన చేకూరేది. అయితే కాలక్రమంలో పాత చర్చిని తొలగించి 2012 మార్చి 27న ఈ నూతన మందిర పునర్నిర్మాణానికి పనులు ప్రారంభించారు. అప్పటి నుంచి అంచెలు అంచెలుగా 13 ఏళ్లపాటు దాతల సహకారంతో కోట్లాది రూపాయలు ఖర్చుతో నిర్మాణం పూర్తీ చేసారు. నూతన మందిరాన్ని 3ప్లోర్స్ 2 స్టెయిర్స్ గా 156 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో భారీ ప్రవేశద్వారంలతో నిర్మించారు. లోపలి భాగంలో రెండు అంతస్తుల్లో ఒకేసారి సుమారు 5వేలమంది పైగా ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. నిర్మించారు. 11 మంది శిష్యులతో కలిసి ఏసు క్రీస్తు విందులో పాల్గొన్న ఘట్టాన్ని శిల్పాలతో ఆకట్టుకునేలా తీర్చి దిద్దారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *