సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు, బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్లో కేంద్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబదించిన అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా, పోలవరం నిధుల కేటాయింపులపై ప్రధానితో సీఎం చంద్రబాబు సమగ్రంగా చర్చించినట్లు సమాచారం. అలాగే అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గత మధ్యంతర బడ్జెట్లో రూ.15 వేల కోట్లు ఆర్థిక సాయాన్ని ప్రతిపాదించారని.. దీనిని కేటాయింపు పూర్తీ చెయ్యాలని ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. వచ్చే జనవరి 8 వ తేదీన విశాఖపట్నం రైల్వే జోన్ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు
