సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ పట్నంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్లిమిటెడ్కు చెందిన స్టీల్‌ప్లాంట్ లో 2024 డిసెంబర్ బ్యాచ్‌కు సంబంధించి దాదాపు 250 అప్రెంటీస్పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 9, 2025వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం పోస్టుల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ (GAT) పోస్టులు 200, టెక్నీషియన్అప్రెంటీస్ ట్రైనీ (TAT) పోస్టులు 50 వరకు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ ఖాళీలు.. మెకానికల్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్అండ్ కమ్యునికేషన్, కంప్యూటర్ సైన్స్/ ఐటీ, మెటలర్జీ, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్విభాగాల్లో ఉన్నాయి. టెక్నీషియన్ అప్రెంటీస్ఖాళీలు.. మెకానికల్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్అండ్ కమ్యునికేషన్, సివిల్, మైనింగ్, కంప్యూటర్ సైన్స్/ మెటలర్జీ, కెమికల్విభాగాల్లో ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 2022, 2023, 2024 సంవత్సరాల్లో సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా, బీటెక్కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే ఎంహెచ్ఆర్డీ ఎన్ఏటీఎస్ 2.0 పోర్టల్‌లో కచ్చితంగా రిజిస్టర్చేసుకుని ఉండాలి.దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాతపరీక్ష నిర్వహించరు. మెరిట్ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
