సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్యాంక్ కాలనీలోని కొపా కళ్యాణ మండపంలో నేడు, ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. ఇటువంటి ఉచిత వైద్య శిబిరంలో అన్ని రకాల వైద్య పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలని, అనుభజ్ఞులైన వైద్యులచే మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కోపా అధ్యక్షులు యర్రంశెట్టి హరినాథ్ మాట్లాడుతూ.. హైదారాబాద్ నుంచి ప్రముఖ కార్డియాలజీ, అంకాలజీ, ఆర్థోపెడిక్, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ మెడిసిన్ వైద్యులచే ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలను ఇక్కడ నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఆర్థోపెడిక్ డా చందు కృష్ణతేజ, గోపిశెట్టి మురళీకృష్ణ, అరేటీ సత్యనారాయణ, జనసేన చెనమల్ల చంద్రశేఖర్, యిర్రింకి సూర్యారావు, ఎంవి రమణ, యర్రంశెట్టి శివకృష్ణ, లంకి శ్రీనివాస్, కారుమూరి సత్యనారాయణ మూర్తి, విజ్జురోతి రాఘవులు, దాయన చంద్రజీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *