సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో గత జగన్ ప్రభుత్వ హయాంలో సినిమా థియేటర్స్ టికెట్స్ ప్రభుత్వం నిర్ణయించేది 100 కోట్ల రూ పైన నిర్మించిన భారీ సినిమాలకు టికెట్స్ ఫై అదనపు ఛార్జి 50 రూ ధర పెంచాలంటే నిర్మాతలకు బ్రహ్మప్రళయం అయ్యేది. అయితే దేశంలో అతి చౌక టికెట్స్ ధరలకు ఏపీ ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేసేవారు. ఇది అఖండ వంటి సినిమా ఘన విజయానికి పనికి వచ్చింది. పుష్ప 1, RRR , గుంటూరు కారం లాంటి సినిమాలకు రావలసిన కలెక్షన్స్ రాలేదు.. ఇది ఆలా ఉంచితే ఏపీలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో NDA కూటమి ప్రభుత్వం వచ్చినప్పటినుంచి సినిమా వాళ్లకు సినిమాలకు టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతులు అవలీలగా ఇస్తున్నారు. దీనితో సంక్రాంతి సినిమా చూడాలంటే ఏపీ ప్రేక్షకుడికి తడిపిమోపెడు అవుతుంది. ఇప్పుడు సంక్రాంతి సినిమాలన్నిటికీ టికెట్ రేట్ల పెంపుకు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.ఏపీ ప్రభుత్వ అనుమతుల ప్రకారం.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు జనవరి 10వ తేదీన తెల్లవారుజాము 1 గంటకు బెనిఫిట్ షో, ఆ రోజు ఆరు షోలకు, ఆ తర్వాత నుంచి రెండు వారాల వరకు రోజుకు అయిదు షోలకు అనుమతులిచ్చారు. ఇక బెనిఫిట్ షో టికెట్ ధర గేమ్ ఛేంజర్ కు 600 రూపాయలు అదనంగా గా విక్రయించుకునేందుకు, మల్టిప్లెక్స్ లలో అసలు టికెట్ ధరకు 175 రూపాయలు అదనం, సింగిల్ థియేటర్లలో 135 రూపాయలు టికెట్ రేటు పెంచుకునేలా అనుమతులు ఇచ్చారు.( టికెట్ టాక్స్ అదనం)బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాకు తెల్లవారుజాము 4 గంటలకు బెనిఫిట్ షోకు, మొదటి రోజు నుంచి రెండు వారాల వరకు రోజుకు 5 షోలకు అనుమతి ఇచ్చారు. బెనిఫిట్ షోకు టికెట్ ధర 500 రూపాయలు పెట్టుకునేలా, రెండు వారాల పాటు మల్టీప్లెక్సుల్లో 135 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 110 రూపాయలు పెంచుకునేలా అనుమతి ఇచ్చారు.ఇక వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు రిలీజ్ రోజు నుంచి రెండు వారాల పాటు రోజుకు అయిదు షోలకు అనుమతులు ఇచ్చారు. అలాగే మల్టీప్లెక్సుల్లో అసలు టికెట్ కు అదనంగా 125 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 100 రూపాయలు టికెట్ రేటు పెంచుకునేలా అనుమతి ఇచ్చారు. ఈసారి .తెలంగాణలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సినిమా టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు లేకపోవడం తో అక్కడ ప్రేక్షకులు అదృష్టవంతులు..
