సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ శివారు పెదఆమిరంలో ని ఉండి ఎమ్మెల్యే , రాష్ట్ర అసెంబ్లీ ఉప సభాపతి రఘురామా కృష్ణంరాజు నివాసం లో నేటి సోమవారం తెల్లవాఱుజామునుండి భారీ ఎత్తున కట్టెలతో ఏర్పాటు చేసిన బోగి మంటల ను వెలిగించి ( ఫై చిత్రంలో చూడవచ్చు) తన ఇంటా సంక్రాంతి సంబరాలు పెద్ద ఎత్తున ప్రారంభించారు. రఘురామా కృష్ణంరాజు తో సహా ఆయన కుటుంబసభ్యులు, కొత్తపల్లి నాగరాజు సన్నిహితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇక ఉదయం నుండి దేవుళ్ళకు పూజలు, బొమ్మల కొలువు, గంగిరెద్దుల ఆటలతో, పండుగ శోభకు శ్రీకారం చుట్టారు. పలువురు కూటమి నేతలు అయన నివాసానికి వచ్చి శుభాభినందనలు తెలిపారు. సంప్రదాయ కోళ్ల పందెలను అతిధిగా వచ్చిన భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు తో కలిసి రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది తెలుగు ప్రజానీకానికి , పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానీకానికి, తన శ్రేయోభిలాషులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు రఘురామా కృష్ణంరాజు ,
