సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎట్టకేలకు, ఇక పవన్ కళ్యాణ్ ఆధర్యంలోని జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి లేఖ పంపించింది. సార్వత్రిక ఎన్నికల్లో 100శాతం విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులు రికార్డు స్థాయిలో 100 శాతం విజయం సాధించడం దేశంలో అరుదయిన రికార్డు గా నమోదు అయ్యింది. ఈ క్రమంలో జనసేన రికగ్నైజ్డ్ పార్టీగా నిలిచి, గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసుకొంది.
