సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2: ది రూల్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా అంతులేని సంచలనాలను క్రియేట్ చేసింది..సంక్రాంతి పండుగకు ముందే ఈ సినిమా రూ. 1830 ప్లస్ కోట్ల వసూళ్లను రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఓటిటి , సాటిలైట్ రైట్స్ కలపి ఇప్పటివరకు ఏ భారతీయ చిత్రం చెయ్యనివిధంగా 2300 కోట్ల పైగా బిజినెస్ సాధించారని ఇటీవల ఐటి రైడ్స్ నేపథ్యంలో వార్తలు వస్తున్నాయి. సంక్రాంతి తర్వాత జనవరి 17 నుండి మరో 20 నిమిషాల ఫుటేజ్‌ని మేకర్స్ యాడ్ చేసి ‘పుష్ప 2 రీలోడెడ్’ పేరుతో థియేటర్స్‌లో ప్రదర్శిస్తుండటంతో.. మళ్లీ కలెక్షన్స్ పుంజుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్‌గా అయితే ఈ సినిమా రూ. 2000 కోట్ల కలెక్షన్ మార్క్‌ను అందుకున్నట్లుగా భావిసున్నారు. ఇది భారతీయ హీరోగా అల్లు అర్జున్ సాధించిన నెంబర్ 1 విజయం. అయితే ఒటిటి ప్రేక్షకుల కోసం.. ‘పుష్ప 2: ది రూల్’ సినిమా తో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ చేసుకున్న ఒప్పందం ప్రకారం, సినిమా విడుదలైన 56 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్కు వస్తుందని అధికారికంగా ప్రకటించారు.అయితే జనవరి 30 లేదంటే, 31న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చే అవకాశం? ఉంది. ఇదిలా ఉంటే.. ఓటీటీ లవర్స్ కోసం టోటల్‌గా 30 నిమిషాల అదనపు ఫుటేజ్‌తో సుమారుగా 4 గంటల సినిమాగా ‘పుష్ప 2’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని భావిస్తున్నారు.
