సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురపాలక సంఘం భవన ఆవరణలో నేడు, ఆదివారం 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో నేడు, ఆదివారం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు స్పెషల్ ఆఫీసర్ , టి.రాహుల్ కుమార్ రెడ్డి మరియు మున్సిపల్ కమిషనర్ కే. రామచంద్ర రెడ్డి, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్ధ సారధి, పాల్గొని మహాత్మా గాంధీ కాంస్య విగ్రహానికి పుష్ప మాలలు వేసి తడుఅప్రి జాతీయ పతాకావిష్కరణ చేయడం జరిగినది…భారత స్వతంత్ర యోధులకు ఘన నివాళ్లను అర్పించడం జరిగింది. వీరితోపాటు పట్టణ ప్రముఖులు మరియు మున్సిపల్ సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది
