సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: యూపీలోని ప్రయోగ రాజ్ మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. కుంభమేళాలో నేడు, బుధవారం పెద్దలకు కతృవులు నిర్వహించే పవిత్ర దినం మౌని అమావాస్య రెండో పుణ్యస్నానోత్సవానికి దేశం నలుమూలల నుంచి ప్రజలు ప్రయాగ్ రాజ్ వద్దకు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో నేటి బుధవారం తెల్లవారు జామున సంగమం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో ఈ అపశృతి చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడగా.. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని అంబులెన్సుల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు. అయితే, ఈ ప్రమాదంలో తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు 20 మంది భక్తులు మృతిచెందినట్లు తెలిసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరో 100 మంది గాయాలు పాలయినట్లు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *