సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది. విజయవాడలో 66 కి.మీ, విశాఖపట్నంలో 76.9 కి.మీ పొడవునా డబుల్ డెక్కర్ మెట్రో సిస్టంకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను నిధుల కోసం కేంద్రానికి సమర్పించారు. 2017లో ఆమోదించిన పాలసీ నిబంధనల ప్రకారం, మెట్రో రైలు ప్రాజెక్టు కు 100% నిధులు ఇవ్వాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు.తాజగా , విజయవాడలో 101 ఎకరాలు, విశాఖలో 98 ఎకరాలు కలిపి మొత్తం 199 ఎకరాల భూసేకరణకు అక్కడి కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండు సిటీలలో తొలిదశ పనులకు రూ.11,009 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *