సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హ్యాండ్సమ్ పర్సనాలిటీ ,టాలెంట్, క్రెజ్ ఉన్నప్పటికీ విజయ్ దేవరకొండ వరుస పరాజయాలతో వెనకబడిపోతున్నప్పటికీ అతనికి భారీ నిర్మాతలు తగ్గలేదు.. హిందీలో టాలెంట్ దర్శకుడు గా పేరున్న తెలుగువాడు, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ హీరోగా విభిన్న గెటప్ లో ‘వీడీ 12’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా టైటిల్‌ను ఈ నెల 12న రేపు అంటే రిలీజ్ కానున్నట్లు తెలిపింది.ఈ సినిమా కోసం కోసం బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) రంగంలోకి దిగుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రానున్న విషయం తెలిసిందే. హిందీ వెర్షన్‌కు రణ్‌బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. యానిమల్’ హీరో వాయిస్‌తో ఈ చిత్రం మరింత వైల్డ్‌గా మారనుందని.నిర్మాతలు పేర్కొన్నారు. అలాగే తెలుగు టీజర్ కు హీరో ఎన్టీఆర్ తమిళ టీజర్‌కు హీరో సూర్య వాయిస్ అందిస్తున్నారు.
