సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వారాంతరాలలో హైదరాబాద్ నుండి గోదావరి జిల్లాలకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈనెల 14, 16,21,23 తేదీలలో 4 ప్రత్యేక రైళ్ళను నడుపుతున్నారు. వాటి వివరాలు పరిశిలిస్తే.. ఈనెల 16 మరియు 23 తేదీలలో రాత్రి 8 గంటల నుండి 07234 నెంబర్ రైలు నరసాపురం నుండి భీమవరం, మీదుగా చర్లపల్లి వరకు ప్రయాణం చేస్తుంది.అలాగే చర్లపల్లి నుండి భీమవరం మీదుగా నరసాపురంకు 07233 రైళ్లు ఈనెల 14 మరియు 21 వ తేదీలలో ప్రయాణిస్తుంది. ఇక కాకినాడ నుండి చర్లపల్లి వరకు 0732 నెంబర్ రైళ్లు ఈనెల 16 మరియు 23 తేదీలలో తాడేపల్లి గూడెం , ఏలూరు మీదుగా ప్రయాణిస్తుంది. అలాగే చర్లపల్లి నుండి కాకినాడ వరకు 07031 రైళ్లు ఈనెల 14 మరియు 21 వ తేదీ సాయంత్రం వేళా నుండి ప్రయాణాలు ప్రారంబిస్తున్నాయి.
