సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూ విసరిస్తుంది. ఈ వైరస తీ వ్రంగా ఉన్న గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలను, కృష్ణ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను రెడ్‌జోన్‌ల్‌గా గుర్తించి.. అక్కడ చికెన్ , గ్రుడ్లు అమ్మకాలపై ప్రభుత్వ నిషేధాజ్ఞలు జారీ చేశారు. కోళ్లు, పౌల్ట్రీ ఉత్పత్తులపై నిఘా పెంచారు. తాజాగా కర్నూలు జిల్లా నర్సింగరావుపేటలో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో.. పౌల్ట్రీ యజమానులను అప్రమత్తం చేశారు అధికారులు. పౌల్ట్రీ నుంచి కిలోమీటర్ వరకు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.చుట్టూ 10 కి.మీ. వరకు సర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పలు చికెన్‌ సెంటర్లపై అధికారులు తనిఖీలు చేశారు. ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేశారు. వారంరోజుల పాటు గుడ్లు, చికెన్‌పై నిషేధం విధించారు. బర్డ్ ఫ్లూ వైరస్ ఒకవేళ మనుషులకు సోకితే లక్షణాలు ఎలా చూపెడతాయో? డాక్టర్లు వివరణ ప్రకారం.. . జ్వరం వచ్చి శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతుంది. తీవ్రమైన గొంతు నొప్పి, పొడిదగ్గు రావచ్చు. తీవ్ర ఆందోళన, తలనొప్పి & అలసటగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి అనిపించవచ్చు. కొంత మందికి మలబద్ధకం లేదా వాంతులు, విరేచనాలు కనిపించవచ్చు. శరీరమంతా కండరాల నొప్పితో బాధపడొచ్చు. కళ్ళు ఎర్రబడటంకళ్ళవెంబడి , నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *