సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఎమ్మెల్యే కోటా క్రింద 5 స్థానాలలో అభ్యర్థుల కేటాయింపు క్రింద కూటమి లో ఇప్పటికే జనసేన టీడీపీ అభ్యర్థులు ఎంపిక పూర్తీ కాగా, తాజాగా బీజేపీ MLC అభ్యర్థిగా ఊహించినట్లే మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి ఎమ్మెల్సీ గా ఎన్నిక కానున్నారు., సోమువీర్రాజు ఎమ్మెల్సీగాను మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఆయన పనిచేశారు.నేడు, సోమవారం ఉదయం బీజేపీ ఎమ్మెల్సీగా సోమువీర్రాజు పేరును ఢిల్లీ లోఅధిష్టానం అధికారికంగా ప్రకటించింది.. ఈరోజు (సోమవారం) రాష్ట్ర శాసనసభలో నామినేషన్లు ఉండటంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరికొద్దిసేపట్లోనే సోమువీర్రాజు నామినేషన్ వేయనున్నారు. అయితే గతం నుండి కూటమిలో ఉంటూనే బీజేపీ పార్టీ తరపున పూర్తీ స్వతంత్రంగా వ్యవహరించే తత్వం ఉన్న సోము వీర్రాజు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ను విమర్శించే తీరు చుస్తే .. ప్రతిపక్ష వైసీపీ నేతలు కూడా సరిపోరు అయిన మరోసారి కేంద్రంలో బీజేపీ అధిష్టానం ప్యూహాత్మకంగా సోము నే ఎమ్మెల్సీ గా ఎంపిక చేసింది.
