సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన పార్టీ ఆవిర్భావ సభ రేపు శుక్రవారం పిఠాపురం లో పెద్ద ఎత్తున లక్షలాది మంది మధ్య నిర్వహించడానికి దాదాపు ఏర్పాట్లు పూర్తీ చేసారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచన మేరకు సభకు ‘జయకేతనం’గా నామకరణం చేసినట్లు మంత్రి నాదెండ్ల చెప్పారు. బహిరంగ సభను పురస్కరించుకుని కాకినాడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మంత్రి నాదెండ్ల సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సభా స్థలానికి వెళ్లే మూడు ప్రవేశ ద్వారాలలో మొదటి ద్వారానికి పిఠాపురం రాజాగా ఎన్నో విద్యాలయాలకు స్థలాలు దానం చేసి, నిధులు ఇచ్చి, ఈ ప్రాంతం అభివృద్ధి పరచిన పిఠాపురం రాజు శ్రీరాజా సూర్యారావు బహుదూర్ పేరునుపెట్టారు. రెండో ప్రవేశ ద్వారానికి మల్లాడి సత్యలింగం నాయకర్ పేరును, అపర అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ పేరును మూడో ద్వారానికి పెట్టాలని పవన్ కల్యాణ్ సూచించారు. పిఠాపురంలో 250 మంది కూర్చునేలా భారీ సభావేదిక, గ్యాలరీ నిర్మాణం, లైటింగ్, జనరేటర్ల ఏర్పాటు వంటి పనులు జరుగుతున్నాయి. సభ జరిగే మొత్తం 24 ఎకరాల్లో ఒక ఎకరం విస్తీర్ణంలో సభావేదిక నిర్మిస్తున్నారు. 12 ఎకరాల విస్తీర్ణంలో 2 లక్షల మంది కూర్చొనేలా ఏడు గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారుసభకు తరలివచ్చే జనసైనికులు, వీరమహిళలకు నిరంతరాయంగా తాగునీరు, పండ్లు, మజ్జిగ ఆహారం అందజేసేందుకు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ప్రధాన రహదారుల్లో మధ్యాహ్నం, రాత్రి భోజనాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.
