సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ అసెంబ్లీలో నేడు, గురువారం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..మా హయాంలో విద్యుత్తూ బిల్లులు పెరిగాయన్నది నిజం కాదని గత వైసీపీ ప్రభుత్వం హయాంలో టారిఫ్ అడ్జస్ట్‌మెంట్, ఫ్యూయల్ సర్చార్జ్ , ట్రూ ఆప్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని చెప్పి రూ. 32,166 కోట్లు ప్రజలపై భారం మోపారన్నారు. గత ప్రభుత్వంలో విద్యుత్ వినియోగం కూడా 4.6 శాతం మేర తగ్గిపోయిందని చెప్పారు. వినియోగదారులు, విద్యుత్ వ్యవస్థపైనా గత ప్రభుత్వం వేసిన భారం రూ.1 లక్ష కోట్లు అని తెలిపారు. విద్యుత్ రంగంలో వారసత్వంగా కొన్ని సమస్యలు కూటమి ప్రభుత్వానికి వచ్చాయన్నారు. అందుకే ప్రజలకు తక్కువ ధరకు , ఉచితంగా విద్యుత్తూ లభ్యమయ్యేలా సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ, బయోప్యూయెల్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను స్మార్ట్ గ్రిడ్ ద్వారా సరఫరా చేయాలని ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. 2025 ఏప్రిల్ 1 నుంచి యూనిట్ కొనుగోలు వ్యయం రూ4.80కు తగ్గిస్తామన్నారు. వచ్చే విద్యుత్‌ను పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి కోసం వినియోగిస్తామన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ కింద ప్రతీ ఇంటిలోనూ విద్యుత్ ఉంటుందన్నారు.. 2 కిలోవాట్ల సామర్ధ్యంతో సౌర ఫలకాలను ప్రతీ ఇంటిపైనా ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు. వందశాతం మేర సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంగా ఏపీ మారాలన్నారు. ప్రతీ నియోజకవర్గంలో కనీసం 10 వేల ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ రావాలని తెలిపారు. ప్రతీ ఇంటికీ 240 యూనిట్ల మేర విద్యుత్ ఉత్పత్తి అవుతుందని.. ప్రస్తుతం రాష్ట్రంలో సగటు వినియోగం 100 యూనిట్ల మేర ఉంటోందన్నారు. మిగతా విద్యుత్ అంతా డిస్కమ్‌లు కొనుగోలు చేసి డబ్బులు చెల్లిస్తాయని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *