సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: S Rకళ్యాణ మండపం మొదలుకొనివిభిన్న చిత్రాల లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్న యువ హీరో కిరణ్ అబ్బవరం ప్రయోగాత్మక సినిమా ‘క’ ఘన విజయంతో ఆయన స్థాయి మరింత పెరిగిపోయింది. నేటి శుక్రవారం యూత్. మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసి యువ దర్శకుడు విశ్వ కరుణ్ రచన, దర్శకత్వంలో ‘దిల్ రూబా‘ సినిమాతో మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కధ విషయానికి వస్తే.. సిద్ధు అలియాస్ సిద్ధార్థ్ (కిరణ్ అబ్బ వరం ) ఒక అమ్మాయి ప్రేమలో పడి విఫల ప్రేమికుడిగా మిగులుతాడు. దానికి తోడు అతని తండ్రి ఒక స్నేహితుడు చేసిన మోసానికి గురియై తట్టుకోలేక చనిపోతాడు. దానితో సిద్దు తన మాటలలో జీవితంలో సారీ, థ్యాం క్స్ అనే మాటల్ని తొలగించేస్తాడు. సిద్దు తన జీవితంలో జరిగిన విషాదాలు మర్చిపోవడానికి బెంగళూరుకు మకాం మారుస్తాడు. అక్కడ అనుకోని పరిస్థితులలో అంజలి (రుక్సర్ థిల్లాన్) ఓ ప్రమాదం లో తనని కాపాడటంతోఆమెకు సిద్ధుపై ప్రేమ కలుగుతుంది. మొదట్లో ఆమె ప్రేమకు సిద్ధు నో చెప్పి నా.. ఆ తర్వా త ఒప్పుకొంటాడు. అయితే అయితే కాలేజీలో జరిగిన గొడవ వల్ల వీళ్లిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అప్పుడు వారిద్దరిని కలిపేం దుకు సిద్ధు మాజీ ప్రేయసి రంగంలోకి దిగుతుంది. మరి ఆ తర్వాత ఏమైంది? అన్నది మిగతా కథ. ఇక సినిమాలో దర్శకుడు తన ప్రతిభను ప్రతి సన్నివేశంలో చూపెడతానికి ప్రయత్నం చేసాడు. అయితే పీల్ మిస్సయింది. సిద్ధు, మ్యా గీల బ్రేకప్ ఛాటింగ్తో ఆరంభించిన తీరు కొత్తగా ఉంది. అయితే ఎక్స్ గర్ల్ ప్రెండ్ తిరిగి రావడం నుండి సెకండ్ హాఫ్ రొటీన్ కధ గా మారిపోయింది. క్లైమాక్స్ బాగుంది. ఇక హీరో కిరణ్ అ బ్బవరం తన పరిధిలో మాస్ క్రేజ్ దృష్టికి పెట్టుకొని నటించాడు.కొత్త హీరోయిన్లు బాగున్నారు. కామిడి సన్నివేశాలు ఇరికించినట్లు ఉన్నాయి. అందరు నటీనటులు సో సో గానే చేసారు. సీఎస్ సామ్ సంగీతం బాగుంది. 2 పాటలు బాగున్నాయి. అయితే K సినిమా తరహాలో డిఫరెంట్ అనుకోని ఉహించుకొనివెళ్ళితే నిరాశ కలుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *