సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విష్ణు ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ లోని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో స్మార్ట్ మరియు సస్టైనబుల్ ఎనర్జీ సిస్టమ్స్ (ICSSES 2025) అనే అంశంపై రెండు రోజుల (14-15 మార్చి 2025) రెండవ అంతర్జాతీయ సదస్సు వర్చ్యువల్ మోడ్ లో నిర్వహించబడిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మంగం వేణు తెలిపారు.సస్టైనబుల్ ఎనర్జీ పరిశోధన మరియు సహకార వ్యవస్థల ప్రాముఖ్యతను వివరించారు. ఈ రెండు రోజుల సదస్సు యొక్క ప్రధాన ఉద్దేశ్యం పరిశోధకులు, విద్యావేత్తలు మరియు పరిశ్రమ నిపుణులకు స్మార్ట్ మరియు సస్టైనబుల్ ఎనర్జీ సిస్టమ్స్‌లోని తాజా ఆవిష్కరణలు, అభివృద్ధులను పంచుకునేందుకు మరియు ఒక ఉమ్మడి వేదికపైకి తీసుకురావడం అని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్ నిర్వాహక బృందం చేసిన కృషిని ప్రశంసించి, యాక్టివ్ పార్టిసిపేషన్‌కి ప్రోత్సహించారు. ఈ సదస్సు కి ముఖ్య అతిథులుగా హాజరైన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కర్ణాటక (NIT కర్ణాటక, సూరత్కల్) ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ డా. వై. సురేష్ మరియు వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT), వెల్లూర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా. సి. ధనంజయులు తమ ప్రసంగాల ద్వారా విద్యార్థులకు భవిష్యత్ దిశలను గురించి విలువైన సమాచారాన్ని అందించారు.
