సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వచ్చే ఏప్రిల్ 1 నుంచి గూగుల్ పే (Google Pay), ఫోన్ పే (PhonePe), పేటీఎం (Paytm) ఏ యాప్‌ల ద్వారా ఈ యూజర్లు డిజిటల్ డబ్బు చెల్లింపులు ఇకపై చేయలేరు.ఎందుకంటే తాజా నిబంధనల ప్రకారం UPI సర్వీసెస్ వాడే ప్రతి ఒక్కరూ తమ ఫోన్ నెంబర్ బ్యాంక్ ఖాతాతో తప్పక లింక్ చేసుకోవాలి.ఇటీవల భారీ స్థాయిలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో NPCI ఈ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకు ఖాతాలకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్లు కొంత కాలంగా యాక్టి‌వ్‌గా లేకపోతే అలాంటి నెంబర్లు వెంటనే తొలగించాలని బ్యాంకులు, UPI ఆధారిత యాప్‌లను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆదేశించింది. ఒకవేళ మీ బ్యాంకు అకౌంట్‌కు వాడుకలో లేని మొబైల్ నెంబర్ ఇచ్చి ఉన్నట్లయితే యూపీఐ ఏప్రిల్ 1, 2025 నుంచి సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *