సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన వరుస భూకంపాలు మయన్మార్ (బర్మా)ను, బ్యాంకాంగ్ ( థాయిలాండ్) దేశాలను కుదిపేశాయి. భారీ భవంతులు క్షణాలలో నేలకూలాయి. రిక్టార్ స్కేల్ మీద రెండు భూకంపాల తీవ్రత 7.5, 6.8 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. భూకంప ధాటికి మయన్మార్ మండలేలోని ఐకానిక్ అవ బ్రిడ్జ్ దగ్గరలోని ఇర్రవడ్డి నదిలో కూలిపోయింది. భూకంప కేంద్రం సాగింగ్ సమీపంలో ఉంది. దాంతో థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితి విధించారు.మయన్మార్‌లో సంభవించిన భూకంపాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే.. వాటికి ధాటికి.. థాయ్ రాజధాని బ్యాంకాక్‌కు 900 కిమీ దూరంలో ఉన్న ప్రాంతంలోని అతి పెద్ద భవనం ఒకటి కుప్ప కూలింది. భారత్ లోని మేఘాలయ రాష్ట్రంలోనూ చైనాలోని నైరుతి యునాన్ ప్రాంతంలో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి. ప్రాణ నష్టం గురించి వివరాలు అధికారికంగా ప్రకటించవలసి ఉంది.
