సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో కాలంగా కూటమి పార్టీలలో కీలకనేతలు ఎదురుచూస్తున్నామరో విడుత నామినేటెడ్ పదవుల నియామకాలు నేడు, శుక్రవారం మొదలయ్యాయి.రాష్ట్ర వ్యాప్తంగా 47 మార్కెట్ కమిటీలకు సంబంధించి స్థానికే ఎమ్మెల్యేల ప్రతిపాదనలతో ఛైర్మన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం 47 మార్కెట్ కమిటీలకు గానూ.. సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేసారు. ప్రకటించిన 47 ఏఏంసీ ఛైర్మెన్ల పదవుల్లో 37 టిడిపి, 8 జనసేన, 2 బీజేపీ నేతలకు దక్కాయి. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల ఛైర్మెన్లను ప్రకటించనున్నారు. . టీడీపీ గత ఏడాది సెప్టెంబరులో నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. మహానాడు కంతా అన్ని పదవులు భర్తీ చేయాలని తెలుగు దేశం పార్టీ అధిష్టానం భావిస్తోంది. తొలి జాబితాలో 20 కార్పొరేషన్ల చైర్మన్లతోపాటు మొత్తం 99 మందికి అవకాశం కల్పించారు. రెండో జాబితాలో మొత్తం 59 మందికి అవకాశం కల్పించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *