సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వరుస పరాజయాలతో ఉన్న నితిన్ (Nithin) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రాబిన్‌హుడ్’.’భీష్మ’హిట్ తర్వాత నితిన్‌తో వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన చిత్రంతో కావడం,అంచనాలు పెరిగాయి. శ్రీలీల మరోసారి నితిన్‌తో జతకట్టగా, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌తో (David warner) గెస్ట్ క్యారెక్టర్ చేయించారు. మరి ఈ చిత్రం భారీ అంచనాలతో నేడు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కధ విషయానికి వస్తే.. రామ్ (నితిన్) ఓ అనాథ గా తనను పోషించిన ఆశ్రమానికి నిర్వహణ ఖర్చులు లేకపోవంతో తనవంతు సాయం చేయాలనుకుంటాడు. అలా మంచి చేయడం కోసం రాబిన్ హుడ్‌గా మారతాడు. ధనవంతులను దోచుకుని కష్టాల్లో ఉన్నవారికి, లేని వారికి సాయం చేస్తుంటాడు. తనఫై పోలీసుల నిఘా పెరగడంతో జాన్ సున్నిపెంట అలియాస్ జాన్ (రాజేంద్రప్రసాద్) కు చెందిన ఇండియాస్ నంబర్‌వన్ సెక్యూరిటీ ఏజెన్సీలో పనికి చేరతాడు. అదే సమయంలో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన నీరా వాసుదేవ్ (శ్రీలీల)కు సెక్యురిటీ గార్డ్ గా వెళ్తాడు రామ్. ఆమెను ఓ ముఠా ఫాలో అవుతుంది. అసలు నీరా ఎవరు? ఆమె ఇండియాలోని ఓ గ్రామానికి ఎందుకు వచ్చింది? సామి (దేవదత్తా నాగే)కు ఆమెకు లింక్ ఏంటి? నీరా ను రామ్ ఎలా రాబిన్‌హుడ్ లా ఎలా ఆదుకొన్నాడు అన్నది కధ.. ఒక్క మాటలో గతంలో రవితేజ నటించిన ‘కిక్’ లాంటి సినిమా ఇది. అయితే రాబిన్‌హుడ్‌గా నితిన్ కి విభిన్న పాత్ర ఇది. పోలీసులకు దొరికిపోకుండా తెలివిగా ట్విస్ట్ లతో తప్పించుకోవడంతో ఫస్టాఫ్ బాగానే సాగుతుంది. అయితే సెకండ్ హాఫ్ లో గంజాయి మాఫియా సీక్వెన్స్, కాన్సర్ మందు అంటూ బలవంతంగా మరో కధ ఇరికించి పట్టు సడలించారు. దానితో నత్తనడకన సాగుతుంది. కథ, కథనం రొటీన్‌గా ఉన్నాయి. అయినా దర్శకుడు ఉన్నంతలో కొత్తదనం చూపించాడు. వివాదాలు సృష్టించిన ‘అదిదా సర్‌ప్రైజ్’లో ‘హుక్’ స్టెప్ మిస్ అయింది. వివాదం కారణంతో ఎడిట్ చేసినట్లు ఉన్నారు. హీరోగా నితిన్ మంచి ఉత్సహంగా, స్టైలిష్ గా నటించారు, శ్రీలీల పాత్ర సినిమాకు కీలకమే అయినా ఆమెతేలిపోయింది. జాన్ స్నోగా రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్ లు నవ్వులు కురిపించారు. విలన్ క్యారెక్టర్ బలంగా, ఉంది. కానీ హీరో ముందు కావాలని తగ్గిపోతాడు.ఇక డేవిడ్ వార్నర్ ఎంట్రీ స్టైలిష్‌గా ఉంది. కాకపోతే ఆ పాత్ర వల్ల సినిమాకు పెద్ద ప్లస్ కాలేదు. సరదాగా ఉంది అంతే. జీవీ ప్రకాశ్ సంగీతం పర్వాలేదు. సినిమా క్వాలిటీ లో నిర్మాణంలో మైత్రీ మూవీస్ తన బ్రాండ్ నిలబెట్టుకోంది అయితే బీష్మ స్థాయిలో భారీ అంచనాలతో సినిమాకి వెళ్తే నిరాశ తప్పదు.
