సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు నడుస్తున్న కూటమి నేతలకు ఇప్పటివరకు విడతలుగా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగుతుంది. ఇక ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పదవి తరువాత కీలకంగా భావించే .. రాష్ట్రంలో మొత్తం 218 వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ల పదవులలో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు 47 ఏఎంసీలకు చైర్మన్లను ప్రకటించారు. మరి కొద్దీ గంటలలో లేక రేపటిలోగా మరో 60 ఏఎంసీ చైర్మన్ల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. మిగతా నియామకాలు కూడా వచ్చే మే మొదటివారానికల్లా రోజుల్లో పూర్తిచేసేయాలని భావిస్తున్నారు. టీడీపీ లో కీలక నేతలతో పాటు జనసేన, బీజేపీ స్థానిక నేతల డిమాండ్ లను పరిగణలోకి తీసుకోని ఆచితూచి చైర్మెన్ లను ఇతర సభ్యులను ఎంపిక చేస్తుండటం తో నియామకాలు ఆలస్యం అవుతుంది. రాష్ట్రంలో కీలకమైన దేవాలయాల ధర్మకర్తల మండలి చైర్మెన్ లు , సభ్యుల నియామకాలు కూడా ఆలస్యం అవుతుండటంతో పలు ప్రాంతాలలో కూటమి పార్టీల లోని క్యాడర్ లో కొంత అసహనం వ్యక్తం అవుతుంది.
