సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయాలు ఎప్పుడు ప్రశాంతంగా సాగుతాయి. ఎన్నికలు లో పరుష పదజాలం వాడిన ఎన్నికలు అవ్వగానే నేతలు పార్టీలు కార్యాలయాలకు పరిమితం చేసి అందరు ఏంటి బావ.. అన్న గారు.. అక్కయ్య.. సోదర తరహా సంస్కారవంతమైన కలుపుగోలుతో కార్యక్రమాలలో సైతం పాల్గొంటూ ఉంటారు. అటువంటిది ఇటీవల ఇక్కడ ప్యాక్షన్ సినిమాలను తలపించే డైలాగ్ లతో ఒకరినొకరు రెచ్చగొట్టుకొనే సంసృతి ప్రబలుతోంది. ఇటీవల తెలుగు మీడియా సంచలనం ఏమిటంటే.. వైసీపీ కీలక నేత గతంలో జిల్లా పరిషత్తు చైర్మెన్ గా మంచి ప్రతిష్ట సాధించి 2 సార్లు తణుకు ఎమ్మెల్యే, గా పదవి నిర్వహించిన సీనియర్ నేత,మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు ఇటీవల ఏలూరులో ఉమ్మడి జిల్లా వైసీపీ సమావేశంలో.. కూటమి ప్రభుత్వం వైసీపీ వారిని అక్రమ కేసులతో వేధిస్తోందని.. (మొదలు పెట్టి.. ఒక్కసారిగా,) వచ్చే ఎన్నికలు తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చాక .. గుంటూరు పరిసర ప్రాంతాలలో కూటమి నేతలను ఇంట్లో నుండి బయటకు తీసికొనివచ్చి ‘లాగి పడేసారు.. నరికి పడేస్తారు’ అంటూ హద్దు మిరి మాట్లాడారు. ఇక చూసుకోండి.. పశ్చిమలో కూటమి నేతలు కూడా రెచ్చిపోయారు. ( కారుమూరిఫై కేసులు పెట్టడంతో పాటు .. వేదికలు ఎక్కి, ‘నా.. కొడకా’.. స్థాయి బాషా తో వేదికలఫై మండిపడ్డారు.ఇది ఒక ఎత్తు అయితే .. రాజకీయాలకు అతీతంగా ఎంతో సౌమ్యుడు గా పేరొందిన స్థానిక ఎంపీ , బీజేపీ కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సైతం కారుమూరిని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. వందల కోట్ల దోచేసిన అవినీతి పరుడు అని , త్వరలో జైలుకు వెళతాడంటూ.. రైతులను వెర్రిపప్ప అన్న పెద్ద వెర్రి పప్పా అని అంటూ.. కూటమి నేతల జోలికి వస్తే కాళ్ళు చేతులు తీసేస్తాం అంటూ ‘లైన్’ దాటేసారు. ఇక తాజగా.. కారుమూరి నాగేశ్వర రావు కూడా శ్రీనివాస వర్మ మీద.. ‘కార్పొరేటర్ కు ఎక్కువ ఎంపీకి తక్కువ’ అంటూ.. కుక్కను సింహాసనం.. సేటైర్స్ వేస్తూ.. అప్పుడే 100 కోట్లు కొట్టేసావని ప్రజలు అంటున్నారని ఆరోపిస్తూ, తణుకు ప్రాంతంలో ఆవులను మాంసం కోసం చంపిస్తుంటే RSS నుండి వచ్చిన వర్మ ఏమి చేస్తున్నారంటూ?.. సీఎం యోగిని చూసి నేర్చుకోవాలని విమర్శలు చేసారు. ఏది ఏమైనా పశ్చిమ లో రాజకీయాలు ఏవైనా.. ఈ తరహా బాషా నేతలకు విలువ పెంచదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *