సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నేడు, మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు.ఢిల్లీ లో పలువురు కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్టానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతున్నారు. చంద్రబాబు ముందుగా నేటి ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు ఫై చర్చలు జరిపారు. నిజానికి తన 75 వ జన్మదినం నేపథ్యంలో కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని గత సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. నేడు ఢిల్లీలో పర్యటన కొనసాగిస్తున్నారు.
