సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలును ఐటీ విద్య శాఖల మంత్రి నారా లోకేష్ నేడు, బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. పదో తరగతి రెగ్యులర్ పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను కూడా విడుదల చేశారు. ఈసారి పరీక్షలలో 81.14 శాతం ఉత్తీర్ణత సాధించారని ప్రకటించారు.ఈ ఏడాది మొత్తం 6,14,459 మంది విద్యార్థులు పరీక్ష రాయగా. 4,98,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని అన్నారు. ఏపీలో ఈసారి పార్వతీపురం మన్యం జిల్లా 93.90 శాతం ఉత్తీర్ణత రేటుతో అగ్రస్థానంలో ఉండటం గమనార్హం. రాష్ట్రంలో 1,680 పాఠశాలలు 100 శాతం ఫలితాలను సాధించాయన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయినవారు నిరుత్సాహపడవద్దని జీవితం రెండవ అవకాశాన్ని అందిస్తుందని అన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 19వ తేదీ నుండి 28 వరకు జరుగుతాయన్నారు.
