సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీటీడీ కొత్తగా తీసుకొన్న తాజా నిర్ణయం ప్రకారం కలియుగ వైకుంఠం తిరుమల లో ఇకపై పూర్వపు పద్దతి మాదిరి వీ వీఐపీ ల ప్రజా ప్రతినిధుల కు ప్రొటోకాల్‌ ప్రకారం , రిఫరెల్‌, జనరల్‌ బ్రేక్‌ దర్శనాలను ఉదయం 7.30 గంటల లోపు పూర్తి చేసి తర్వాత వీలైనంత మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించి తిరిగి 10.15 గంటల నుంచి 11.30 గంటలలోపు శ్రీవాణి, టీటీడీ ప్రస్తుత, రిటైర్డ్‌ ఉద్యోగులకు దర్శనం కల్పించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు.( ఇప్పటివరకు వీఐపీ బ్రేక్‌ దర్శనాలను ఉదయం 10 గంటలకు మార్చారు.) ఇక సిఫారసు లేఖలపై బ్రేక్‌ దర్శనాలనూ నేటి గురువారం నుంచి జూన్ 15వరకు రద్దు చేసిన నేపథ్యంలో ఉదయం గంట, మధ్యాహ్నం గంటన్నర అదనంగా సామాన్య భక్తులకు దర్శన సమయం లభిస్తుందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *