సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మండు వేసవిలో అడపాదడపా వర్షాలు మాములే.. అనుకున్నారు కానీ.. నిన్న భీమవరం ఉదయం 7 గంటలకు మొదలు పెట్టి కొద్దీ విరామం తో 10 గంటల వరకు భారీ ప్రభంజన గాలులతో చెలరేగిపోయిన కుంభవృష్టి దెబ్బకు పట్టణం అల్లకల్లోలం అయ్యింది. పిడుగులు దెబ్బకు ప్రజల భయాందోళన కు గురి అయ్యారు. పట్టణంలో పలు భారీ వృక్షాలు, ఫ్లెక్సీ బోర్డులు నేలకొరిగాయి. పలువురు గాయపడ్డరు.విష్ణు కాలజీ వైపు ప్రధాన రోడ్డుఫై ఒక తాడి చెట్టు అకస్మాత్తుగా కూలిపోవడంతో .. అప్పుడే ఒక కుటుంబం తో వచ్చిన కారు దానిని ఢీ కొన్నప్పటికీ అదృస్టవశాత్తూ వారు గాయాలతో బయటపడ్డారు. ఆటోలు, పలు వాహనాలు ద్వంసం అయ్యాయి. చెట్లను తొలగించడం మునిసిపల్ స్టాప్ కు,కరెంట్ లైన్ మెన్లకు. ఆర్ &బి అధికారులకు తల కు మించిన భారం పడింది. పట్టణం అంతా విద్యుతు సరఫరా నిలచిపోయింది. సాయంత్రం 5 గంటల నుండి కొన్ని ప్రాంతాలలో కరెంట్ ఇస్తే చాల ప్రాంతాలకు రాత్రి 8 గంటలు 10 గంటల వరకు విద్యుత్తూ సరఫరా లేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.అసలే ఆదివారం సెలవు రోజు. ఇక ఇంటర్ నెట్, కేబుల్ టివి సర్వీస్ లు అయితే చెప్పనక్కరలేదు. అవి రాత్రికి గాని పునరుద్దరించాలకేపోయారు. అప్పటివరకు ఇన్వెక్టర్స్ ఉన్న చూడటానికి ఏమి లేదు.ఇన్వెక్టర్స్ కూడా మధ్యాహనానికే మొరాయించాయి.ఇక సెల్ ఫోన్ లకు మొబైల్ సర్వీస్ సిగ్నెల్స్ అందవు. ఓక రకంగా చెప్పాలంటే జనానికే పిచ్చెక్కిపోయింది.ఆక్వా సాగు తో పాటు మామిడి పంట తీవ్రంగా దెబ్బతింది. లోతట్టు ప్రాంతాలలో నీరు నేటి మంగళవారానికి అలానే ఉంది. గుడ్డిలో మెల్ల నేడు ఉదయం నుండి భారీ ఎండ కాస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *