సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలోగత 10 రోజులుగా పలు చోట్ల వర్షాలు పడినప్పటికీ ఎండల వేడిమి మరల పెరిగింది, వర్షాల కోసం శుభవార్త ఏమిటంటే.. ఈసారి దేశం లోకి నైరుతి రుతుపవనాలు గతంలో కంటే ముందుగానే ప్రవేస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సాధారణం గా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిం చడం తదుపరి జులై10 నాటికి ఇవి దేశమంతా విస్తరిస్తాయి. అయితే ప్రస్తుతం జూన్ 1 కం టే ముందుగా మే 27న కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) శనివారం ప్రకటిం చింది. అయితే గతేడాది మే 30న రాగా.. 2023 జూన్ 8న, 2022 మే 29న దేశం లోకి ప్రవేశించడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *