సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో 2వ అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం.. మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా దర్శనం కోసం వెళ్లే భక్తులకు ముఖ్య విజ్ఞప్తి ఏమిటంటే.. . షిరిడీలో అన్ని రకాల ప్రసాద వితరణను తాత్కాలికంగా కొద్దీ రోజులు పాటు నిలిపివేశారు. అలాగే ప్రసాదాలతో పాటు పూలదండలు, బొకేలు, శాలువాలను కూడా ఆలయంలోకి అనుమతించబోమని షిరిడీ సాయిబాబా ట్రస్ట్ వెల్లడించింది. ఈ సంచలన నిర్ణయానికి కారణం ఏమిటంటే .. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో షిరిడీ ఆలయానికి మే 2వ తేదీ నుండి బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వస్తున్నాయి. దీనితో సాయిబాబా ఆలయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. . ఆలయంలోకి వచ్చే భక్తుల్ని క్షుణ్నంగా తనిఖీలు చేశాకే మందిరంలోకి అనుమతిస్తున్నారు. కాగా, సాయిబాబా గుడితో పాటు మహారాష్ట్రలోని ముంబైలోని సిద్ధివినాయక టెంపుల్ మరికొన్ని ప్రసిద్ధ ఆలయాల్లోనూ ప్రసాద వితరణను తాత్కాలికంగా నిలిపివేశారు.
